← Back to news

టెకీలకు కొత్త పార్క్

By Sharmila· 2h ago
టెకీలకు కొత్త పార్క్

TG: హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఏర్పాటు చేసిన పార్కు ను సండే నుంచి అందుబాటులోకి తెచ్చారు. విప్రో సర్కిల్ దగ్గర 2.3 ఎకరాల్లో 14 కోట్ల రూపాయలతో HMDA ఈ పార్కును డెవలప్ చేసింది. పార్కులో మన్మోహన్ సింగ్ విగ్రహం, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. 1991 ఆర్థిక సంస్కరణలు, RBI, విద్యా హక్కు, ఉపాధి హామీ, ఆధార్ వంటి అంశాలను గోడలపై ప్రదర్శించారు. తెలంగాణ కార్నర్‌తో పాటు AP పునర్వ్యవస్థీకరణ చట్టంపై మన్మోహన్ సింగ్ సిగ్నేచర్ ప్రతిని ఏర్పాటు చేశారు.

More in TG