జంతర్ మంతర్‌లో ఆంక్షలు.. అన్నీ క్లోజ్!
అక్టోబర్ 10న CJP ప్రొటెస్టుకి అనుమతి ఇవ్వని ఢిల్లీ పోలీసులు.. జంతర్ మంతర్ దగ్గర ఆంక్షలు అమలు చేశారు. BNS సెక్షన్ 163 విధించారు. అందువల్ల అనుమతి లేకుండా ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది సమావేశం, ధర్నా, ఊరేగింపు చెయ్యడం నిషేధం. ప్రొటెస్ట్ చెయ్యాలనుకుంటే 10 రోజుల ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి. మాగ్జిమం 1,000 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. మల్టీ లేయర్ బారికేడ్లు పెట్టారు. కొన్ని మెట్రోస్టేషన్లను మూసివేశారు. CEC రిజైన్ కోరుతూ ఈ ప్రొటెస్టు చేస్తోంది CJP.

