← Back to news

విద్యుత్ టవర్లకు భూమిస్తే 200 శాతం పరిహారం

By A.Ajay· 1h ago
విద్యుత్ టవర్లకు భూమిస్తే 200 శాతం పరిహారం

విద్యుత్ టవర్ల ఏర్పాటుతో భూములు కోల్పోయే రైతులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. టవర్ నిర్మించే భూమికి మార్కెట్ విలువపై 200 శాతం పరిహారం ఇవ్వాలని తెలిపింది. విద్యుత్ లైన్లు వెళ్లే భూములకు గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం, మున్సిపాలిటీల్లో 45 శాతం, మెట్రో ప్రాంతాల్లో 60 శాతం పరిహారం ఇవ్వాలని సూచించింది. ఈ రూల్స్ 66 కేవీ, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న విద్యుత్ లైన్లకు వర్తిస్తాయి. రాష్ట్రాలకు సొంత విధానాలు ఉంటే వాటిని కొనసాగించవచ్చు.

More in National