ఫుడ్ డెలివరీలోకి Rapido ఎంట్రీ!

TG: హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీకి కొత్త ఆప్షన్ వచ్చేసింది. Rapidoకు చెందిన ‘Ownly’ ఫుడ్ డెలివరీ యాప్ హైదరాబాద్‌లో లాంచ్ అయింది. బెంగళూరు తర్వాత ఇది రెండో మార్కెట్. ముఖ్యంగా ‘జీరో కమిషన్’ మోడల్‌తో Ownly దూసుకొచ్చింది. అంటే రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లపై ఎలాంటి కమిషన్ తీసుకోదు. కస్టమర్లు ఫుడ్ ధరతో పాటు డెలివరీ ఛార్జీ మాత్రమే చెల్లించాలి. డెలివరీలను Rapido Captains చేస్తారు. iOS, Androidలో Ownly అందుబాటులో ఉంది. Rapido యాప్ నుంచీ ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు.



