← Back to news

గ్లోబల్ సమ్మిట్‌.. 2.0

By A.Ajay· 2h ago
గ్లోబల్ సమ్మిట్‌.. 2.0

తెలంగాణ సంస్కృతి, కళలు, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌-2.0లో తెలంగాణ గొప్పదనాన్ని చాటిచెప్పాలని నిర్ణయించింది. రామప్ప గుడి, గద్వాల చీరలు, బతుకమ్మ, పేరొందిన పర్యాటక ప్రాంతాలు, రాష్ట్ర కళలు, హస్తకళలను ప్రపంచ స్థాయిలో ప్రదర్శించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణకు మరింత గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

More in TG