హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 3.6 టన్నుల ఖోవా సీజ్!
TG: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీగా ఖోవాను సీజ్ చేశారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి CURE పరిధిలోని 6 డెయిరీ యూనిట్లు, ఓ ట్రాన్స్పోర్ట్ సెంటర్లో రైడ్స్ చేశారు. అన్హైజీనిక్గా తయారీ, FSSAI లైసెన్స్ లేకుండా రన్ చేయడం, ప్రాపర్ టెంపరేచర్లో స్టోర్ చేయకపోవడం వంటి రూల్స్ బ్రేక్ చేయడం గుర్తించారు. బస్సులు, DCMలో ప్లాస్టిక్ కవర్లతో తీసుకెళ్తున్న 3.6 టన్నుల ఖోవాను సీజ్ చేశారు. కొన్ని యూనిట్లను మూసివేయనుండగా, మరికొన్నింటికి నోటీసులు ఇవ్వనున్నారు.


