ఎల్నినో కంటే కాంగ్రెస్ పాలనే డేంజర్: హరీష్ రావు

TG: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని BRS నేత హరీష్ రావు విమర్శించారు. ఎల్నినోపై శాస్త్రవేత్తలు 9 నెలలుగా హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ రంగంపై సమీక్షలు చేయకుండా కరెంట్ కోతలకు కారణమయ్యారని మండిపడ్డారు. తప్పును అధికారులపై నెట్టి, వారిని సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. అధికారుల ఉద్యోగాల కంటే, ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలపై దృష్టి పెట్టాలని రేవంత్కు హితవు పలికారు.

