← Back to news

తుఫాను తీరం దాటేది అక్కడే!

By Krishna· 9h ago· Zoom
తుఫాను తీరం దాటేది అక్కడే!

బంగాళాఖాతంలో తుఫాను మరింత బలపడింది. ప్రస్తుతం దాని సుడిగాలులు గంటకు 85 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. అది శ్రీకాకుళంకి 88 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ రోజు రాత్రి నుంచి తెల్లవారే లోపు ఎప్పుడైనా తీరం దాటేలా ఉంది. ఎగ్జాక్ట్‌గా శ్రీకాకుళం కేంద్రంగా తీరం దాటే ఛాన్స్ కనిపిస్తోంది. అతి భారీ వర్షాల ప్రభావం.. రణస్థలం, పొందూరు, పొలాకీ, ఆముదాలవలస, కోటబొమ్మాళి, భోగాపురం, విజయనగరం, చీపురుపల్లి, రాజాం, పాలకొండ, తెర్లాం, బొబ్బిలి, వీరఘట్టంపై ఉండేలా కనిపిస్తోంది. <a href="https://www.theclearcutnews.com/n/sdWYwLx">పిడుగులు, </a>ఈదురు గాలులతో జాగ్రత్త.

More in AP