జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థికి 2వ ర్యాంకు

కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. ఈ పోటీల్లో కంభం మండలం తురిమెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన షేక్ యాసిన్ (10వ తరగతి), తిరుమలశెట్టి దినేష్ (9వ తరగతి), జగదీష్ (8వ తరగతి) విద్యార్థుల బృందం ద్వితీయ ర్యాంకు సాధించింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వరికుంట్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


