తెలంగాణకు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్!

తెలంగాణలో వర్షాలు దంచికొట్టనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడొచ్చని తెలిపింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, వరంగల్ సహా 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షంతోపాటూ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయనే అలర్ట్ ఉంది.


