చెరువు కట్ట వద్ద మద్యం సేవిస్తున్న ముగ్గురిపై కేసులు

TG: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ జలెందర్ రెడ్డి హెచ్చరించారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి చెంగిచెర్ల చెరువు కట్ట వద్ద ఆదివారం సాయంత్రం మద్యం సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేశారు. చెరువు కట్టలు, పార్కులు, రహదారుల పక్కన మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిఘా కొనసాగుతుందని తెలిపారు. యువత బైక్ రేసింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, బెట్టింగ్ వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.