CPGET ఫస్ట్ అలకేషన్ లిస్ట్ ఎప్పుడు?

TG-CPGET-2026 పీజీ సీట్ల తొలి జాబితాను ఈనెల 16న రిలీజ్ చేయనున్నట్లు OU పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ పాండురంగా రెడ్డి తెలిపారు. వరుసగా మూడ్రోజులు హాలిడేస్ ఉండటంతో, ఈనెల 14న రావాల్సిన ఫస్ట్ లిస్ట్‌ను వాయిదా వేశారు. వివిధ వర్సిటీల్లో ఉన్న 48 వేల పీజీ సీట్లకు గానూ ఎంట్రన్స్ టెస్ట్‌లో 43 వేల మంది క్వాలిఫై అయ్యారు. అందులో మొదటి విడత కౌన్సెలింగ్‌కు 24 వేల మంది అభ్యర్థులు అటెండ్ అయినట్లు అధికారులు చెప్పారు.