HYROX హైప్.. ఫిట్‌నెస్‌కు కొత్త క్రేజ్!

జిమ్‌లో కేవలం వెయిట్స్ ఎత్తడం కాదు.. ఇప్పుడు HYROX ఛాలెంజ్‌తో ఫిట్‌నెస్ లెవెల్‌ను ప్రూవ్ చేసే ట్రెండ్ దూసుకెళ్తోంది. ఇందులో 1 కి.మీ. రన్ తర్వాత ఒక ఫంక్షనల్ వర్కౌట్ చేయాలి. ఇలా మొత్తం 8 రన్స్ + 8 వర్కౌట్స్ పూర్తి చేయాలి. స్లెడ్ పుష్, రోయింగ్, బర్పీలు, వాల్ బాల్స్ వంటి టాస్కులు ఉంటాయి. మొదట బేసిక్ ట్రైనింగ్‌తో ప్రారంభించి, ఓవర్‌ట్రైనింగ్‌కు దూరంగా ఉండాలని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.



