ఎస్సై జగదీష్‌ను పరామర్శించిన టీజేఏసీ చైర్మన్

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల గణేష్ నిమజ్జనం వేడుకల పర్యవేక్షణలో భాగంగా విధుల్లో పర్యటిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా టీజేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ ఆసుపత్రికి వెళ్లి ఎస్సై జగదీష్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జగదీష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



