← Back to news

డిసెంబరు 18 నుంచి 39వ హైదరాబాద్ బుక్ ఫెయిర్

By Vishi· 1d ago
డిసెంబరు 18 నుంచి 39వ హైదరాబాద్ బుక్ ఫెయిర్

TG: డిసెంబరు 18 నుంచి 39వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరగనుందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ తెలిపింది. ఇవాళ సర్వసభ్య సమావేశం నిర్వహించి 2026–28 సంవత్సరాలకు నూతన కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాంపల్లి రమేశ్, ఉపాధ్యక్షులుగా కె.బాల్ రెడ్డి ఎన్నికయ్యారు. డిసెంబరు 18 నుండి 28 వరకు 11 రోజుల పాటు NTR స్టేడియంలో బుక్ ఫెయిర్ జరుగుతుందని తెలిపారు. అన్ని వసతులు కల్పిస్తూ పుస్తక ప్రదర్శనను విజయవంతం చేస్తామన్నారు.

More in Arts/Literature