ఛాయ సాహిత్య ఉత్సవం.. కంటెంట్ క్రియేటర్లకు ఆహ్వానం

TG: నవంబర్ 14, 15వ తేదీల్లో హైదరాబాద్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రెండో విడత ఛాయ సాహిత్య ఉత్సవం(CLF 2026) నిర్వహిస్తున్నారు. తెలుగు సాహిత్యానికి ప్రాధాన్యం ఇస్తూ, భారతీయ, ప్రపంచ సాహిత్యాలతో అనుసంధానంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో కంటెంట్ క్రియేటర్లు, బుక్స్టాగ్రామర్లు, రివ్యూవర్లు, సాహిత్య ప్రేమికులు పాల్గొనవచ్చని నిర్వాహకులు ఆహ్వానించారు. <a href="https://www.chaayaliteraturefestival.com/">వెబ్సైట్</a>లో రిజిస్టర్ అవ్వాలని తెలిపారు. నవంబర్ 15న ఇన్ఫ్లుయెన్సర్ల సమావేశం ఉందని తెలిపారు.



