వైజాగ్‌కు త్వరలో డబుల్ డెక్కర్ మెట్రో

AP: వైజాగ్‌లో డబుల్ డెక్కర్ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని మంత్రి పి.నారాయణ చెప్పారు. మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తగ్గించడంతోపాటు ప్రజలకు వేగవంతమైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. GVMC, VMRDA పరిధిలోనూ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో CM వర్చువల్‌గా పాల్గొన్నారు.

