గణేష్ నిమజ్జనంలో నిబంధనలు పాటించాలి: ఏసీపీ

హనుమకొండ జిల్లా పరకాలలో గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పరకాల ఏసీపీ సతీష్‌బాబు కోరారు. నిమజ్జన ఊరేగింపుల్లో DJ శబ్దాన్ని పరిమితికి మించి వినియోగించరాదని సూచించారు. విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, లోతైన నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని భక్తులకు తెలిపారు. మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమాల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.


