ఓదెలలో బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి భూమిపూజ

TG: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఊర చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కనికిరెడ్డి సతీష్ భూమిపూజ చేశారు. మహిళలు ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ కోసం బతుకమ్మ మెట్లు, ఘాట్ నిర్మించాలని పాలకవర్గం తీర్మానం చేసినట్లు సర్పంచ్ తెలిపారు. పాలకవర్గ సభ్యులతో కలిసి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపతి శ్రీలత-ప్రవీణ్, వార్డు సభ్యులు గొర్ల శ్రీనివాస్, దూలం సదానందం, రాపెల్లి రాజయ్య, చింతం విజయ-స్వామి, పెండం లక్ష్మీ-ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.