ఉల్లాస్ పరీక్షకు 1,367 మంది మహిళల హాజరు..!

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని 40 గ్రామాల మహిళా సంఘాల నిరక్షరాస్య సభ్యుల కోసం సోమవారం నిర్వహించిన 'ఉల్లాస్' పరీక్షకు 1,367 మంది హాజరయ్యారు. కేంద్రాలను పరిశీలించిన స్టేట్ డైరెక్టర్ లక్ష్మీజీరావు, జిల్లా డీడీ రాజేంద్రప్రసాద్ ప్రతి మహిళా చదువుకుని చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సత్యనారాయణరాజు, సీసీలు, వీఓఏలు పాల్గొన్నారు.



