100 ఏళ్ల GPO.. హోదా తగ్గించొద్దు: Owaisi

TG: హైదరాబాద్‌లోని GPO(General Post Office)ను Group ‘A’ నుంచి Group ‘B’కి తగ్గించి హైదరాబాద్ సిటీ డివిజన్‌లో విలీనం చేసే ప్రపోజల్‌ను వెనక్కి తీసుకోవాలని MP అసదుద్దీన్ ఒవైసీ కేంద్రాన్ని కోరారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ పెమ్మసాని చంద్రశేఖర్‌కు లెటర్ రాశారు. హైదరాబాద్ GPO 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సంస్థ అని, నగరంలో పోస్టల్ సేవలకు కీలకంగా ఉందని తెలిపారు. Telangana Philatelic Bureau కూడా ఇక్కడే ఉందని, GPOను Group ‘A’గానే ఉంచాలని కోరారు.

