జి.కొండూరు మండలంలో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

కర్నూలు జిల్లా జి.కొండూరు మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జి.కొండూరు, దుగ్గిరాలపాడు బీసీకి, అటుకూరు, చిన్న నందిగామ, కందులపాడు, పినపాక ఎస్సీకి, కట్టుబడిపాలెం ఎస్టీకి కేటాయించారు. గడ్డమణుగు, గంగినేనిపాలెం, గుర్రాజుపాలెం, సున్నంపాడు, కోడూరు, వెలగలేరు, వెంకటాపురం తదితర గ్రామాలు జనరల్ మహిళలకు కేటాయించారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది.



