ఇళ్లు పూర్తికాకముందే వరుస డ్రాలు.. స్పష్టత ఇవ్వాలి

భద్రాద్రి జిల్లా పాత కొత్తగూడెంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తికాకముందే లబ్ధిదారుల ఎంపికకు వరుసగా డ్రాలు నిర్వహించడంపై సమగ్ర అభివృద్ధి వేదిక (SAV) వ్యవస్థాపక అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ ఫైరయ్యారు. 2BHK ఇళ్ల నిర్మాణానికి రూ.44 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించి తొమ్మిదేళ్లు గడిచినా పనులు పూర్తికాలేదని తెలిపారు. మూడేళ్ల క్రితం 614 మందికి డ్రా నిర్వహించగా.. తాజాగా మరో 214 మందికి డ్రా నిర్వహించడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు.



