మార్నింగ్ లేవగానే ఇలా అస్సలు చేయొద్దు

ఉదయం ఎలా ప్రారంభమవుతుందో, రోజంతా మన శరీరం, మనసు కూడా అలాగే స్పందిస్తాయి. మనం చేసే చిన్న తప్పులు శారీరక శక్తిని తగ్గించడమే కాకుండా మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఉదయం లేవగానే ఏ పని ఎప్పుడు చేయాలో ముందే ప్లాన్ లేకపోతే చివరి నిమిషంలో హడావుడి మొదలవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. చాలామంది కళ్లు తెరవగానే ఫోన్ తీసుకుని సోషల్‌మీడియా, మెసేజ్‌లు, వార్తలు చూస్తుంటారు. రోజును ఇలా ప్రారంభించడం మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. టిఫిన్ అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత బిజీగా ఉన్నా అల్పాహారం తీసుకోవాలి



