ఎయిడ్స్‌పై అవగాహన కోసం 5K రన్

మార్కాపురం జిల్లా కేంద్రంలోని కోర్టు సెంటర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు 5K రన్ నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ నివారణ, వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


