నీళ్లు రాక ఇబ్బందులు...ప్రజల ఆవేదన!

విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడ గ్రామంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. గత నాలుగు రోజులుగా డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమ్మర్ కాకపోయినా పైప్‌లైన్ రిపేర్లు, మోటార్ పాడవ్వడం వల్లే నీటి సరఫరా ఆగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.