← Back to news

వీపు గోకినందుకు..నెలకు 14 లక్షల ఆదాయం

By Sharmila· 1d ago
వీపు గోకినందుకు..నెలకు 14 లక్షల ఆదాయం

చైనాకు చెందిన 32 ఏళ్ల ఝాంగ్ షియావోకియావో డిఫరెంట్ వ్యాపారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. షెన్జెన్‌ ప్రాంతంలో కేవలం వీపు గోకే సేవలను అందిస్తూ రెండు స్టోర్లను నిర్వహిస్తున్నాడు. చేతులు అందని వీపు భాగాల్లో దురదను తీర్చుకునేందుకు ఈ సేవలను ప్రజలు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రెండు స్టోర్ల ద్వారా నెలకు సుమారు రూ.14 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ఈ వ్యాపారాన్ని చైనా వ్యాప్తంగా 100 స్టోర్లకు పెట్టాలన్నదే ఝాంగ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

More in International