← Back to news

ప్రజావాణి ఫిర్యాదుపై చర్యలు ఏవీ? ఏక్మాయి SC వార్డు సమస్యలు!

By Kamal· 10h ago· Ekmai, Basheerabad, Vikarabad
ప్రజావాణి ఫిర్యాదుపై చర్యలు ఏవీ? ఏక్మాయి SC వార్డు సమస్యలు!

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో ఎస్సీ వార్డు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. మురుగు కాలువలు, రోడ్లు, పారిశుధ్యం, దోమల బెడదతో వారి రోజూ గడవడం లేదు. ఆగస్టు 24న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.. రిఫరెన్స్ నంబర్ DVIKB24082600085 కూడా వచ్చింది. బషీరాబాద్ పంచాయతీ అధికారికి పంపించారు కానీ.. ఇంకా చర్యలు మాత్రం లేవు! మురుగు నీరు నిలిచి దోమలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, కాలువలు సరిచేసి శాశ్వత పరిష్కారం తీసుకోవాలంటూ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.

More in Local