← Back to news

వికారాబాద్‌‌లో పులి సంచారం

By Anusha· 1d ago· X

TG: వికారాబాద్‌.. పరిగి మండలం.. బసిరెడ్డిపల్లిలో పులి కలకలం రేపుతోంది. రాత్రివేళ గోశాలలోకి వచ్చిన పులి ఓ ఆవుపై దాడి చేసి చంపిందనీ.. మూడు రోజుల కిందట ఓ దూడను కూడా ఎత్తుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. నైట్‌ విజన్‌ CCTVలో కనిపిస్తున్న జంతువు టైగరే కావచ్చని భావిస్తున్నారు. గోశాలలో దాదాపు 200 ఆవులు ఉండటంతో గ్రామస్తులు భయపడుతున్నారు. పులిని వెంటనే పట్టుకుని అడవికి తరలించాలని అధికారులను కోరుతున్నారు.

More in TG