కల్లేపల్లిలో VB G RAM G గ్రామసభ.. అభివృద్ధికి ప్రాధాన్యం!

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం VB G RAM G గ్రామసభ జరిగింది. సర్పంచ్ బిగుల్లా మోహన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. గత ఆరు నెలల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కూలీ డబ్బులను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ వినీత్ గౌడ్, ఆడిట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి ఆకుల రాకేష్, వార్డు సభ్యులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.



