← Back to news

బస్ డిపో నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

By Sagar· 17h ago· Peddapalle (Ct), Peddapalli, Peddapalli
బస్ డిపో నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రూ.8 కోట్లతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ డిపో పనులను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పరిశీలించారు. ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. దసరా నవరాత్రుల నాటికి డిపోను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

బస్ డిపో నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
బస్ డిపో నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

More in Local