← Back to news

బ్లింకిట్ ఆర్డర్స్ జాగ్రత్త.. కుళ్ళిన సరుకులు, బొద్దింకలు!

By sahani· 11 Aug 2026· Officechai· Mumbai
బ్లింకిట్ ఆర్డర్స్ జాగ్రత్త.. కుళ్ళిన సరుకులు, బొద్దింకలు!

ముంబైలోని ఒక బ్లింకిట్ స్టోర్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సడన్‌గా చెకింగ్స్ చేశారు. అక్కడి ఫ్రూట్స్, వెజిటబుల్స్‌పై బొద్దింకలు తిరగడం, తిండి వస్తువులను కింద పడేయడం చూసి అధికారులు షాక్ అయ్యారు. అంతేకాకుండా ఎక్స్‌పైర్ అయిపోయిన సరుకులను కస్టమర్లకు అమ్ముతున్నట్టు పట్టుకున్నారు. రూల్స్ బ్రేక్ చేయడంతో ఆ బ్లింకిట్ స్టోర్ ఫుడ్ లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. నీట్‌గా లేని ఇలాంటి ఫుడ్ స్టోర్స్‌పై పబ్లిక్ కూడా కంప్లైంట్ చేయవచ్చని చెప్పారు.

More in Business