శాకపూర్ ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం శాకపూర్ వద్ద మంచిర్యాల–కరీంనగర్ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్నాయి. ఒక కారు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కిషన్రావుపేటకు చెందిన శ్రీను, కొమురయ్య తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.




