← Back to news

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మట్టి గణపతుల పంపిణీ

By DK· 1d ago
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మట్టి గణపతుల పంపిణీ

భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థానికులకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు, ఎకో క్లబ్, కల్చర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారైన విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. మట్టి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని కళాశాల ప్రిన్సిపల్ కే. జాన్ మిల్టన్ పేర్కొన్నారు.

More in Local