బ్రెజిల్‌లో వేల మంది విద్యార్థుల ప్రొటెస్ట్

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల తొలి రౌండ్‌లో మాజీ ప్రెసిడెంట్ ఫ్లావియో బోల్సోనారో ముందంజలో నిలవడంతో.. ఆయనకు వ్యతిరేకంగా రియో డి జనీరోలో వేల మంది విద్యార్థులు నిరసనకు దిగారు. ప్రజాస్వామ్యం, పబ్లిక్ ఎడ్యుకేషన్, సామాజిక హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యా రంగానికి మరింత మద్దతు ఇవ్వాలని, వారానికి 6 రోజులు పని, 1 రోజు మాత్రమే సెలవు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 25న జరగనున్న రెండో దశ ఎన్నికలకు ముందు ఈ మార్చ్ జరిగింది.



