← Back to news

SGSW ఉద్యోగుల మహా గర్జన!

By Mahesh Kuruva· 1d ago· AP
SGSW ఉద్యోగుల మహా గర్జన!

AP: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ (SGSW) ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం రేపు విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ నిరసనకు సిద్ధమయ్యారు. SGSW ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ‘చలో విజయవాడ’ కార్యక్రమం జరగనుంది. ప్రమోషన్లు కల్పించడం, డిప్యూటేషన్లు క్యాన్సిల్ చేయడం, ప్రొబేషన్ పీరియడ్‌కు 2 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం, నేటివ్ మండలాల్లో పోస్టింగ్స్ ఇవ్వడం వంటి డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు పెట్టనున్నారు. వర్క్ ప్రెషర్‌తో చనిపోయిన ఉద్యోగుల ఫ్యామిలీలకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు.

More in AP