← Back to news

బీజేపీలో భారీగా చేరికలు

By అనిల్ బాబు· 1d ago· Upparagudem, Seerole, Mahabubabad
బీజేపీలో భారీగా చేరికలు

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్, సెక్రటరీ బానోత్ అవినాష్ ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షుడు పాల్త్య రాము నాయక్ సమక్షంలో వారు బీజేపీ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగులోత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

More in Local