చిలువూరులో ఉచిత వైద్య శిబిరం
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి సి. ఇందిర, AIIMS వైద్యులు సిద్ధార్థ, అతితి, మండల BJP అధ్యక్షుడు అడపా వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.



