రెస్టారెంట్లలో అపరిశుభ్రత.. 8 సంస్థల లైసెన్సులు సస్పెండ్

హైదరాబాద్‌లో 15 రెస్టారెంట్లలో TG SAFE బృందాలు తనిఖీలు నిర్వహించాయి. బొద్దింకలు, ఎలుకలు, కుళ్లిన కూరగాయలు, గడువు ముగిసిన ఆహారం గుర్తించి 16 నమూనాలు సేకరించారు. నిబంధనలు ఉల్లంఘించిన 8 సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్ చేశారు. లైసెన్స్ లేకుండా అపరిశుభ్రంగా ఉన్న బాచుపల్లి లక్కీ రెస్టారెంట్ను మూసివేసి, మరో 5 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.


