బడ్జెట్‌లో 18 శాతం నిధులు కేటాయించాలి: ఆకునూరి మురళి

TG: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో విద్య రంగానికి కనీసం 18 శాతం నిధులు కేటాయించాలని విద్యా కమిషన్ మాజీ చైర్మన్, TPF నాయకుడు ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. రాత్రి సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్‌లో నిర్వహించిన బడి నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యా వ్యవస్థ బలపడితే సమాజంలో మార్పు తీసుకురావచ్చని అన్నారు.

