← Back to news

సెమీకండక్టర్లకు తెలంగాణే బెస్ట్: శ్రీధర్‌బాబు

By DK· 3d ago
సెమీకండక్టర్లకు తెలంగాణే బెస్ట్: శ్రీధర్‌బాబు

TG: సెమీకండక్టర్ తయారీకి తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఎదుగుతోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జర్మన్ కంపెనీలను ప్రోత్సహించాలని జర్మన్ ఇండియన్ బిజినెస్ అలయన్స్‌ (GIBA) ప్రతినిధులను కోరారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో GIBA ప్రతినిధులు మంత్రిని కలిశారు. సెమీకండక్టర్స్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

More in TG