← Back to news

అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

By DK· 2d ago
అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

TG: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయం, భీముని పాదం అటవీ ప్రాంతాలను ప్రసాదరావు జిల్లా అధికారులు శ్రీమన్నారాయణ రెడ్డి, రాజేంద్రప్రసాద్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రసాదరావు అన్నారు. అటవీ నిర్మూలన, వన్యప్రాణుల వేట, ప్లాస్టిక్ వినియోగం, అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. వన్యప్రాణులు గాయపడినా లేదా జనావాసాల్లోకి వచ్చినా వాటిపై దాడి చేయకుండా వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

More in Local