ఖాళీ స్థలాల యజమానులకు ఫైన్ వేయాల్సిందే

మంగళగిరి హైస్కూల్ గ్రౌండ్‌లో పిచ్చి మొక్కలు పెరిగి, వర్షపు నీరు నిలవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ నీరు ఇళ్ల సెప్టిక్ ట్యాంకుల్లోకి చేరుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఆ మొక్కలను తొలగించి, నీటిని క్లియర్ చేయాలని స్కూల్ మేనేజ్‌మెంట్‌ను కోరుతున్నారు. అలాగే ఖాళీ స్థలాలను గాలికి వదిలేసే ఓనర్లపై ఫైన్ వేయాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.



