జర్నలిస్టులకు ఫైనాన్షియల్ సపోర్ట్!

మహబూబ్‌నగర్‌లో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నలుగురు జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించింది. ప్రెస్‌క్లబ్‌లో చెక్కులు అందజేశారు. చికిత్స పొందుతున్న అనిల్ భార్య, డ్యూటీలో యాక్సిడెంట్ అయిన సబ్‌ఎడిటర్ ప్రదీప్‌కుమార్, రవికుమార్, మధుసూదన్‌రెడ్డికి సాయం అందింది. కష్టాల్లో జర్నలిస్టులకు అండగా ఉండటమే లక్ష్యమని అధ్యక్షుడు వాకిట అశోక్‌కుమార్ చెప్పారు.


