← Back to news

అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు.. రోడ్లు, వంతెనలు జలమయం!

By Jagadish· 17h ago
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు.. రోడ్లు, వంతెనలు జలమయం!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. పాడేరు, పెదబయలు, ముంచింగిపుట్టు, గూడెంకొత్తవీధి, చింతపల్లి, జె. మడుగుల మండలాల్లో వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు-సిరివాడ మార్గంలోని బొంతు వంతెనపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెదబయలు మండలం గుల్లేలు పంచాయతీ కింద ఉన్న వంతెనపై బంగారు వాగు పొంగిపొర్లుతోంది. బంత్రోటుపుట్టు, కుంతురు గ్రామాల సమీపంలో గెడ్డలు పొంగాయి.

More in Local