← Back to news

పర్యావరణ హితం కోసం మట్టి గణపతుల పంపిణీ

By DK· 2d ago
పర్యావరణ హితం కోసం మట్టి గణపతుల పంపిణీ

TG: మంచిర్యాల జిల్లా కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా వినాయకచవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏడాది వేలాది విగ్రహాలను చెరువు మట్టితో తయారు చేయించి, స్థానిక బస్టాండ్ ఎదుట భక్తులకు అందజేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీ ద్వారా కళాకారులను ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నామని కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ తెలిపారు.

More in Local