← Back to news

ఉప్పరగూడెంలో డీజేల భారీ శబ్దాలతో ఇబ్బందులు

By నిమ్మనగంటి అనిల్ బాబు· 1d ago· Upparagudem, Seerole, Mahabubabad

మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం ఉప్పరగూడెంలో మూడు రోజులుగా భారీ శబ్దాలతో డీజేలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వరకు డీజేల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. డీజేలకు అనుమతులు ఉన్నాయా? లేకపోతే ఇంత భారీ శబ్దాలతో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అనుమతులు ఎవరు ఇచ్చారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

More in Local