జింబాబ్వే సిరీస్‌కు స్మృతి.. కొత్త కెప్టెన్

జింబాబ్వేతో సిరీస్‌కు భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధానను BCCI ఎంపిక చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో స్మృతికి బాధ్యతలు దక్కాయి. 16 నుంచి మూడు T20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. T20లకు షఫాలీ వర్మ, వన్డేలకు దీప్తి శర్మ వైస్ కెప్టెన్లుగా ఉంటారు. హర్మన్ రెండు ఫార్మాట్లలోనూ ఆడనుంది. శ్రీచరణికి రెండు జట్లలో చోటు దక్కగా, అరుంధతి రెడ్డికి T20 జట్టులో స్థానం లభించింది. T20లు రాయ్‌పూర్‌లో, వన్డేలు వడోదరలో జరుగుతాయి.



