← Back to news

ఆటోమేటిక్ విద్యుత్ సబ్‌స్టేషన్

By A.Ajay· 1d ago
ఆటోమేటిక్ విద్యుత్ సబ్‌స్టేషన్

TG : హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో 14.38 కోట్లతో నిర్మించిన తొలి ఆటోమేటిక్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను అధికారులు ప్రారంభించారు. 33/11 K.V. సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ సబ్‌స్టేషన్‌ ద్వారా అత్తాపూర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యుత్ సరఫరా మెరుగుపడనుంది. మొత్తం 8 విద్యుత్ లైన్ల ద్వారా పలు ప్రాంతాలకు కరెంట్ అందించనున్నారు. ఈ సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి రావడంతో విద్యుత్ సరఫరాలో అడ్డంకులు తగ్గి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందనున్నాయి.

More in TG