మంగళగిరి ఎయిమ్స్‌లో రేడియాలజీ సదస్సు
మంగళగిరి ఎయిమ్స్‌లో ఏపీ IRIA 12వ వార్షిక రాష్ట్ర సదస్సు ఈ నెల 25 నుంచి 27 వరకు జరుగుతోంది. విజయవాడ సబ్‌చాప్టర్, ఎయిమ్స్ రేడియో-డయాగ్నోసిస్ డిపార్ట్‌మెంట్ కలిసి దీన్ని నిర్వహిస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎయిమ్స్ ఆడిటోరియంలో దీని ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రోగ్రామ్‌లో డాక్టర్లు, రేడియాలజీ నిపుణులు పాల్గొని లేటెస్ట్ స్కానింగ్ పద్ధతులు, కొత్త టెక్నాలజీపై చర్చించనున్నారు.



